WGL: నర్సంపేట నియోజకవర్గ MLA దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం HNKలోని MLA దొంతి నివాసానికి వెళ్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం MLA కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.