W.G: నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇవాళ తాడేపల్లిగూడెం తన నివాసం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర చేసి, వినతిపత్రం అందజేశారు. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు జోగుతున్నారని విమర్శించారు. అసలుకు నకిలీకి తేడా లేకుండా మద్యాన్ని తయారు చేశారని దుయ్యబట్టారు.