ASR: ఇటీవల జరిగిన డీఎస్సీలో ఎలమంచిలికి చెందిన సయ్యద్ హన్సర బేగం టీచర్ ఉద్యోగం సాధించారు. జీ.మాడుగుల మండలం చిలకలమామిడి పాఠశాలలో పోస్టింగ్ వచ్చింది. దీంతో తన భర్తతో ఎంఈవో బాబూరావుపడాల్ను కలిసి నియామక పత్రం అందుకున్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించడానికి బైక్పై చిలకలమామిడి వెళుతుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడ్డారు. పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు.