‘మిత్రమండలి’ సినిమా ప్రమోషన్స్‌లో ప్రియదర్శి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోతే.. సినిమా హిట్ అవ్వకపోతే.. నా తదుపరి సినిమాను చూడకండి. ఇది నా ప్రామిస్. దీపావళిని మేము తొందరగా తీసుకొస్తాం. అందరూ.. హ్యాపీగా నవ్వుకోండి. సంతోషంగా మీ ఫ్యామిలీతో గడపండి’ అని చెప్పారు. ఇక ఈ మూవీ ఈ నెల 16న రిలీజ్ కాబోతుంది.