NZB: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని షేక్పేట్ డివిజన్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని మంగళవారం ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ఉపఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.