WNP: జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గన్నీ బ్యాగులు, ధాన్యం క్లీన్ చేసే యంత్రాలు, బరువు కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు.