KMR: జిల్లా మెకానిక్ అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన్ను కలిసిన మెకానిక్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలను వివరించారు. దీనిపై షబ్బీర్ అలీ స్పందిస్తూ, మెకానిక్ల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.