AP: విద్యుత్ ఉద్యోగులతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విద్యుత్ యాజమాన్యం ఎదుట మొత్తం 29 డిమాండ్లు ఉంచినా.. ప్రధాన అంశాలపై స్పష్టత రాలేదని JAC స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైనా ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మె యధావిధిగా కొనసాగుతుందని విద్యుత్ JAC ప్రకటించింది.