TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షంతో పాటు గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది.