అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందున్నాడు. అయితే ట్రంప్ దేశానికి చాలా ప్రమాదకరమని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పగ, ప్రతీకారంతో బరిలోకి దిగుతున్న ఆయన్ను రాబోయే ఎన్నికల్లో తిరస్కరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
Biden: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందున్నాడు. అయితే ట్రంప్ దేశానికి చాలా ప్రమాదకరమని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పగ, ప్రతీకారంతో బరిలోకి దిగుతున్న ఆయన్ను రాబోయే ఎన్నికల్లో తిరస్కరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ఏటా చేసే స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వార్షిక సమావేశంలో అధ్యక్షుడు తమ ప్రభుత్వ విధానాలు, ప్రాథమ్యాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు ఉంచుతారు. కానీ, రెండోసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న బైడెన్ తాజాగా ఈ వేదికను తన అభ్యర్థిత్వాన్ని బలపర్చుకోవడం కోసం ఉపయోగించుకున్నారు.
జీవితం నాకు స్వేచ్ఛ, ప్రజాస్వమ్యాన్ని స్వీకరించడం నేర్పింది. నిజాయితీ, మర్యాద, గౌరవం, సమానత్వం, అమెరికాను నిర్వచించిన ఈ విలువలపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందరినీ గౌరవించాలి. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ద్వేషానికి ఎక్కడా తావివ్వొద్దు. కానీ ఇప్పుడు కొంతమంది పగ, ప్రతీకారంతో కూడిన అమెరికాను చూస్తున్నారంటూ పరోక్షంగా ట్రంప్‌పై బైడెన్ విరుచుకుపడ్డారు. ఔషధ ధరలను తగ్గించటం, కఠిన వలస విధానాల రూపకల్పనపై కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.