»Pawan Kalyans Special Pooja In Nukalamma Temple Video Viral
Pawan Kalyan: నూకాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న జనసేనాని.. వీడియో వైరల్
జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రత్యేకపూజలో పాల్గొన్నారు సోమవారం ఉదయం అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లి ఆలయాంలో ఆయన అనుచరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Pawan Kalyan's special pooja in Nukalamma temple.. Video viral
Pawan Kalyan: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆయన పార్టీ నేతలతో కలిసి సోమవారం ఉదయం నూకాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఏపీలోని అనకాపల్లిలో ఉన్న ప్రసిద్ద నూకాలమ్మ తల్లి ఆలయానికి పవన్ కల్యాణ్ వచ్చారు. అర్చకులతో ఆయన ప్రత్యేక పూజలు నిర్విహించారు. ఎన్నికల సమయంలో ఆయన పెట్టుకున్న మొక్కని జనసేన నాయకులు తెలిపారు. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రమాణస్వీకారానికి ముందు నూకలమ్మ తల్లి ఆశీర్వావచనాలు తీసుకుంటా అని ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా మారిన పవన్ కల్యాణ్ ఏ మంత్రిత్వశాఖ తీసుకుంటారు అనే చర్చ సాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించింది. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీలకు కూటమికి ఒప్పించడం, ఎన్డీఏ కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేయడం, అలాగే రెండు లోక్‌సభ స్థానాల్లో తన అభ్యర్థులను నిలుచోబెట్టి ఒంటి చేత్తో అనుహ్యమైన విజయాన్ని సొంత చేసుకున్నాడు. నిలిబడిన అన్ని స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులు గెలవడంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. దీంతో ఏపీ ప్రజల్లో ఒకింత ఆశాభావం వ్యకం అవుతుంది. కచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి పథం వైపు సాగుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక జూన్ 12న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో పవన కల్యాణ్ ఏ బాధ్యత తీసుకుంటాడని అందరిలో ఆసక్తి నెలకొంది. కేంద్రంలో ఏపీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి.