ప్రో కబడ్డీ సీజన్-12లో భాగంగా ఇవాళ ఢిల్లీ వేదికగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు జరిగే తొలి మ్యాచ్లో పాట్నా పైరేట్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. అలాగే, రా.9 గంటలకు జరిగే మరో మ్యాచ్లో యూపీ యోధాస్తో తమిళ తలైవాస్ పోటీపడనుంది. ఈ మ్యాచ్లను జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో వీక్షించవచ్చు.