»United Airlines Fire In The Airlines Plane Emergency Landing
United Airlines: ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్
యూనైటెడ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌లో మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి యూఏ1118 ఫ్లైట్ ఇంటర్నేషనల్ హూస్టన్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్ట్ మాయర్స్ వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి.
United Airlines: యూనైటెడ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌లో మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి యూఏ1118 ఫ్లైట్ ఇంటర్నేషనల్ హూస్టన్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్ట్ మాయర్స్ వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. ఆ తర్వాత 15 నిమిషాలకు ఎడమ రెక్క కింద ఉన్న ఇంజిన్ నుంచి భారీగా మంటలు రావడం మొదలయ్యాయి. దీంతో టెక్సాస్‌లో తక్షణమే అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఇంజిన్‌లో నిప్పులు రావడాన్ని గుర్తించిన వెంటనే ఓ సిబ్బంది వచ్చి ప్రయాణికులను సమాచారం తెలియజేశారు.
విమానం గాల్లోకి ఎగరగానే భారీ చప్పుడు వినిపించిందని విమానంలోని ప్రయాణికురాలు తెలిపింది. మంటలను గమనించిన వెంటనే విమానం తిరిగి హూస్టన్ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులకు వెంటనే మరో విమానాన్ని ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు తరలించారు. ఈ ఘటనపై అమెరికాకు చెందిన నియంత్రణ సంస్థ ఎఫ్ఏఏ దర్యాప్తు చేపట్టింది. ఇదే సంస్థకు చెందిన ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ డోర్ ప్లగ్ ఊడిపోయింది. మళ్లి అదే సంస్థకు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి.