»Kuala Lumpur Airport Gas Leak At Malaysia Airport 39 Passengers Sick
Kuala Lumpur Airport: మలేషియా ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. 39 మంది ప్రయాణికులకు అస్వస్థత
మలేషియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ సదుపాయంలో గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో సుమారు 39 మంది అస్వస్థతకు గురయ్యారు.
Kuala Lumpur Airport: Gas leak at Malaysia airport.. 39 passengers sick
Kuala Lumpur Airport: మలేషియాలోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్ సదుపాయంలో గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో సుమారు 39 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే ప్రయాణికులు తీవ్రంగా ప్రభావితం కాలేదని, విమాన అంతరాయాలు లేవని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్యాసింజర్ టెర్మినల్‌కు ఇంజినీరింగ్ సౌకర్యం వేరుగా ఉందని, గ్యాస్ బారిన పడినవారు అక్కడ పనిచేస్తున్న మూడు కంపెనీల్లో పనిచేశారని అగ్నిమాపక శాఖ తెలిపింది.
39 మంది మైకం, వికారంగా ఉందని ఫిర్యాదు చేశారు. 14 మందిని చికిత్స పొందేందుకు ఎయిర్ డిజాస్టర్ యూనిట్‌కి పంపారట. అయితే గ్యాస్ లీక్ అయిన రసాయనం మిథైల్ మెరకాప్టాన్గా గుర్తించారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌కు వాసనకు కలిసి, ఉపయోగించని ట్యాంక్ నుంచి వస్తున్నట్లు డిపార్ట్మెంట్ తెలిపింది. అయితే ఈ గ్యాస్ లీక్ ఎలా జరిగిందని ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.