తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎనిమిది డిమాండ్లతో ధర్నా చేశారు. వెంటనే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Junior doctors are on an indefinite strike across Telangana
Junior Doctors: రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సోమావారం ఉదయం ధర్నా చేశారు. దాదాపు 4 వేల మంది ఈ సమ్మెలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. స్టయిఫండ్ సమయానికి రావాలని దీనితో పాటు మొత్తం 8 డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎమర్జెన్సీ సేవలు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు వంటి విధులను బహిష్కరించారు. గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం కానీ, వైద్యశాఖ మంత్రి కానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అందుకే నిరవధిక సమ్మెకు దిగినట్లు వారు తెలిపారు.
ప్రతి నెల 10వ తేదీలోగా స్టైపెండ్ వచ్చేలా గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత దృష్ట్యా పోలీసులను ఏర్పాటు చేయాలి.
ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం ఉమ్మడి కోటాను తెలంగాణ విద్యార్థులకే దక్కేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలి.
కాకతీయ మెడికల్ కాలేజీ క్యాంపస్లో ఇన్నర్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి.
సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెండ్లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం.
ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం నిర్మించాలి.
హాస్టల్ భవనాలను నిర్మించాలి. విద్యార్థులు ఇబ్బందుల దృష్ట్యా వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలి.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు కల్పించాలి.
#WATCH | Telangana junior doctors organise a protest at the Osmania Medical College in Hyderabad as part of the indefinite statewide strike.
They say that they will boycott outpatient (OPD) services, elective surgeries and ward duties and demand the solution of unresolved… pic.twitter.com/QsK3EXaSSB