Mahesh Babu: రాజమౌళి కోసం మహేష్ బాబు కీలక నిర్ణయం?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానే లేదు గానీ.. సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Mahesh Babu: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. రీసెంట్గా విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పడం.. మహేష్ బాబు జర్మనీకి వెళ్లడంతో రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది. తాజాగా మహేష్ బాబు ఈ సినిమా కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే రాజమౌళి తన సినిమాలకు రెమ్యూనరేషన్‌కు బదులుగా లాభాల్లో వాట తీసుకుంటూ ఉంటాడు. మహేష్ బాబు కూడా కొన్ని సినిమాలకు అలాగే చేశాడు. కానీ లాభాల్లో వాటా అందుకునే ముందు హీరోకి కొంతైనా రెమ్యూనరేషన్ ఉంటుంది.
చదవండి:NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. ఈ సడెన్ మీటింగ్ ఎందుకు?
కానీ రాజమౌళి సినిమాకు మాత్రం మహేష్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల ఇన్సైడ్ టాక్. మహేష్, రాజమౌళి ఇద్దరు కూడా లాభాల్లో వాటా తీసుకునేలానే సినిమాకు రెడీ అవుతున్నారట. ఇక ఈ సినిమా కోసం మహేష్ రెండేళ్ల సమయాన్ని కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫిజికల్‌గా వర్క్ స్టార్ట్ చేసేశాడు మహేష్. వచ్చే ఉగాదికి ఈ ప్రాజెక్ట్ లాంచనంగా ప్రారంభం కానుందని అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ లేదు కానీ, సమ్మర్లో ఎస్ఎస్ఎంబీ 29 రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయడం పక్కా అంటున్నారు. అన్నట్టు.. ఈ ప్రాజెక్ట్‌ని వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు టాక్ ఉంది.