»60 Percent Kannada Language Should Be Used Tension In Bengaluru
Kannada భాషే వాడాలి… బెంగళూరు ర్యాలీలలో ఉద్రిక్తత
వాణిజ్య, వ్యాపార సంస్థల బోర్డులపై కన్నడ అక్షరాలనే రాయలని కర్ణాటక రక్షణ వేదిక చేసిన విజ్ఞప్తిపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. బోర్టులపై 60శాతం కన్నడ అక్షరాలే ఉండాలని ఆదేశించింది. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు దుకాణాలపై, షాపులపై పడి బోర్డులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు.
60 percent Kannada language should be used Tension in Bengaluru
Kannada: కన్నడ భాష(Kannada language)కు సంబంధించిన వివాదం కర్ణాటక(Karnataka)లో ఉద్రిక్తంగా మారింది. వాణిజ్య వ్యాపార నిర్వాహకులు తన షాపులకు పెట్టే పేర్లను, బోర్డులపై కేవలం కన్నడ భాషలోనే రాయలని కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వ్యాపార, వాణిజ్య సంస్థల బోర్డులపై 60 శాతం(60% Kannada) కన్నడ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి మద్దతినిస్తూ కర్ణాటక రక్షణ వేదిక (Pro-Kannada group) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. ఈ క్రమంలో బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తంగా మారాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా నిరసనకారులు చెలరేగిపోయారు. హోటళ్లు, దుకాణాలపై ఇంగ్లీష్‌లో ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కన్నడలో అక్షరాలు ఉండాలని బెంగళూరు నగరపాలక సంస్థ ఆదేశాలు ఇవ్వడంతో.. తక్షణమే అమలు చేయాలని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు డిమాండు చేస్తూ బెంగళూరులో ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో హోటళ్లు, దుకాణాల బయట ఇంగ్లీష్‌లో ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల నల్లరంగు పూశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్ బెంగళూరు మహానగర సంస్థ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ మాట్లాడారు. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఆ నియమాలను పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.