»The Thief Who Stole The Golden Toilet Worth Rs 50 Crores In The Uk
Viral News: రూ.50 కోట్లు విలువైన ‘బంగారు టాయిలెట్’ను కొట్టేసిన దొంగ
బంగారు టాయిలెట్ కమోడ్ విలువ రూ. 50.36 కోట్లు ఉంటుంది. దాన్ని ఓ దొంగ సునాయసంగా దొంగలించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The thief who stole the 'golden toilet' worth Rs.50 crores in the UK
Viral News: ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో జరిగిన ఓ సంఘటన చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఏకంగా ఓ దొంగ భారీ ఖరీదైన బంగారు టాయిలెట్ కమోడ్ను దొంగలించాడు. 300 ఏళ్ల నాటి బ్లెన్‌హీమ్ అనే ప్యాలెస్‌లో ఈ కమోడ్ ఎంతో ప్రత్యేకమైనదిగా ప్రసిద్ది. అలాంటిది దాన్ని దొంగలించడం అసాధ్యం కానీ ఈ దొంగ చాకచక్యంగా కొట్టేశాడు. దీని విలువ 48,00000 పౌండ్లు (సుమారు రూ. 50.36 కోట్లు) ఉంటుందట. అయితే ఈ బంగారు టాయిలెట్‌ను తానే దొంగిలించినట్టు జేమ్స్ షీన్ అనే దొంగ అంగీకరించాడు. మధ్య వయస్కుడైన ఈ వ్యక్తి సెప్టెంబర్ 2019లో ప్యాలెస్‌లో నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో దాన్ని కొట్టేసినట్టు తెలిపాడు. ఇన్నాళ్లకు దానికి సంబంధించిన విషయం బయటపెట్టాడు.
అతనికి వస్తువులు దొంగలించడం కొత్తేమి కాదు. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్న వాటిని ఎక్కువగా దొంగలించడానికి ఇష్టపడుతాడు. వాటిని జాగ్రత్తగా వేరేచోటుకు తరలించి అమ్మెస్తుంటాడు. అలానే ఈ కమ్మోడును ఆక్స్ఫర్డ్ క్రౌన్ కోర్టు హాల్లో ప్రదర్శనకు ఉంచినప్పుడు కొట్టేశానని అతడు ఒప్పుకున్నాడు. ఇలాంటి దొంగతనం కేసుల్లో ఆయన ప్రస్తుతం 17 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. గతంలో నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి 400,000 పౌండ్ల విలువైన ట్రాక్టర్లు, పలు ట్రోఫీలను సైతం కొట్టేశాడు. అయితే విలాసవంతమైన ఈ కమోడ్ పేరు అమెరికా అని పేరు ది గార్డియన్ కథనం పేర్కొంది. ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరిజియో కాటెలన్ దీనిని రూపొందించాడు. ప్రస్తుతం ఆ కమ్మోడు ఫోటోలు దాని విలువ మీడియాలో వైరల్‌గా మారింది.