»Sushil Kumar Modi I Have Been Battling Cancer For Six Months
Sushil Kumar Modi: ఆరు నెలలుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాను
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఆరోగ్య సమస్యల వల్ల ఎన్నికల ప్రక్రియలో భాగం కాలేకపోతున్నట్లు తెలిపారు.
Sushil Kumar Modi: గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. ఆరోగ్య సమస్యల వల్ల ఎన్నికల ప్రక్రియలో భాగం కాలేకపోతున్నట్లు తెలిపారు. గత ఆరు నెలల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు అతను తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నా అన్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ లేదా ప్రచారం చేయలేను. ప్రధానికి అన్ని విషయాలు వివరంగా తెలిపాను. దేశానికి, బిహార్‌కి, పార్టీకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా జీవితం ప్రజా సేవకు అంకితం అని సుశీల్ మోదీ తెలిపారు. సుశీల్ కుమార్ 2005 నుంచి 2020 మధ్య సీఎం నీతీశ్ కుమార్ ప్రభుత్వంలో రెండుసార్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.