»Bjp Mp Laxman Cbi Should Be Probed Into Cm Revanth Reddys Phone Tapping
BJP MP Laxman: సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు కోరాలి
పత్రిపక్ష నేతల ఫోన్ల ట్యాప్ చేశారని గతంలో బిజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దుబ్బాక, మునగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని లక్ష్మణ్ అన్నారు. దీనిపై పూర్తిగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిన కోరారు.
BJP MP Laxman: పత్రిపక్ష నేతల ఫోన్ల ట్యాప్ చేశారని గతంలో బిజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దుబ్బాక, మునగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయని లక్ష్మణ్ అన్నారు. దీనిపై పూర్తిగా విచారణ చేయాలన్నారు. అసలు దోషులను వదిలిపెట్టకూడదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ దర్యాప్తు కోరాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి టామ్ అండ్ జెర్రీ ఫైట్లా ఉందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పరస్పర విమర్శలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ధరణి మీద విచారణకు కమిటీ వేశారని.. దానికి అతీగతీ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఫోన్ ట్యాపింగ్ చేసిందని లక్ష్మణ్ అన్నారు. దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.