»A Robot Injured An Engineer At The Us Tesla Giga Factory
Robot: రోబో దాడిలో ఇంజనీర్‌కు గాయాలు
మనుషులకు సాయపడుతాయని రోబోలను తయారు చేస్తే అవి తిరగపడుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో ఓ రోబో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను గాయపరిచింది.
A robot injured an engineer at the US Tesla Giga factory
Robot: ఈ మధ్య రోబో(robot)లు దాడి చేసిన ఘటనలు చాలా చూస్తున్నాము. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని టెక్సాస్‌లోని టెస్లా(Tesla) గీగా ఫ్యాక్టరీ(Giga factory)లో ఓ రోబో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను గాయపరిచింది. గీగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యూపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందిన రిపోర్ట్‌లో ఈ విషయం తెలిసింది. ఈ ఘటన జరిగి రెండు సంవత్సరాలు అయింది. ఆస్టిన్లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో ఈ రోబోను అల్యూమినియం పలకలను కోసి కారు విడిభాగాలను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.
రోబోల సాఫ్ట్‌వేర్‌ను ఇంజినీర్ అప్డేట్ చేస్తున్న సమయంలో వాటిని ఇనాక్టివ్ చేస్తారు. కానీ ఈ ఘటన జరిగినప్పుడు రోబో యాక్టివ్గానే ఉంది. అప్డేట్ చేస్తున్న సమయంలో ఇంజనీర్‌ను తోసేసింది. తాను వెల్లకిలా పడడంతో అతన్ని నేలకు అదిమిపట్టింది. రోబోకు ఉండే ఇనుప భాగాలు బాధితుడి వీపుకు గుచ్చుకున్నాయి. అతడి చేతికి కూడా తీవ్ర గాయమైంది. ఫ్యాక్టరీ ఫ్లోర్ అంతా రక్తంతో నిండింది. ఇదే ఫ్యాక్టరీలో 2021, 2022లో వరుసగా ప్రమాదాలు జరిగాయి. ఆ తరువాత ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆ నివేదిక తెలిపింది. టెక్సాస్‌లోని ఫ్యాక్టరీలో గతేడాది 21 మంది సిబ్బందిలో ఒకరు గాయపడ్డట్టు ఇంజ్యురీ రిపోర్టులో తేలిసింది.