తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ గత కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా ఆయనకు కరోనా సోకడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిశారు.
Vijaykanth: తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ (Vijayakanth) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనుకు కరోనా సోకింది. దాంతో చెన్నైలో మియోట్ ఆసుపత్రిలో చేర్చారు. ఇది వరకే శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. దానికి తోడు కరోనా రావడంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమిండంతో తుదిశ్వాస విడిచారని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మరణంతో ఇండస్ట్రీతో పాటు, రాజకీయ శ్రేణుల్లో విశాదం అలుముకుంది. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయకాంత్ కుటుంబానికి ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే, మరోవైపు రాజకీయాల్లో సత్తా చాటాడు. తమిళనాడు శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా భాద్యతలను నిర్వహించాడు.