Telugu comedian Abhinav Gomatham debut as a hero with Mastu Shades vunnaira Neelo.
Mastu Shades vunnaira Neelo: వెండితెరపై చాలా మంది కమెడియన్స్ హీరోలుగా మారి సినిమాలు తీసి హిట్లు కొట్టారు. కొంత మంది ఇప్పటికీ హీరోలుగా కొనసాగుతున్నారు. కత్తి కంతారావుతో మొదలు పెడితే, బ్రహ్మానందం, అలీ, సునీల్, సప్తగిరి తదితరులు సినిమాల్లో హీరోగా మెప్పించారు. అదే వరుసలో సుహాస్, సత్య, ప్రియదర్శి, వైవా హర్ష వంటివారు లీడ్ రోల్లో చిత్రాలను తీసి విజయం సాధిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి అభినవ్ గోమఠం చేరిపోయారు. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయింది. హీరో స్నేహితుడి పాత్రలు ఎన్నో చేశారు. కామెడీలో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అందుకే అభినవ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఈ నగరానికి ఏమైంది సినిమాలో మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో అనే డైలాగ్‌తో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం అదే టైటిల్‌తో హీరోగా లాంచ్ అవుతున్నారు. తిరుపతిరావు నిర్మించిన మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా, ఈ నెల 23వ తేదీన థియేటర్లకు రానుంది. లవ్ డ్రామా, కామెడీ ప్రధానమైన కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో తక్కువ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుందని తెలుస్తుంది. వైశాలి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ ఓ కీలక పాత్రలో అలరిస్తాడు.