కొన్ని రోజుల క్రితం ప్రెగ్నెన్సీని ప్రకటించి షాక్ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. అయితే పెళ్లి కాకుండానే ఇల్లీ బేబి తల్లి కావడం ఏంటి? హాట్ టాపిక్ అయింది. ఫైనల్‌గా భర్తను ఇంట్రడ్యూస్ చేసిన ఇలియానా.. ఇప్పుడు బికినీతో ఫోటోతో వార్తల్లో నిలిచింది.
Ileana: అప్పట్లో ఇలియానా పేరు వింటే చాలు.. కుర్రాళ్లకు చెమటలు పట్టేవి. అమ్మడి అందానికి దాసోహం కానీ వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు తన అందంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది ఇలియానా. దేవదాసుతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత పోకిరి, మున్నా, జల్సా వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా రాణించింది. అంతేకాదు టాలీవుడ్లో కోటి పారితోషికం అందుకున్న బ్యూటీల్లో ఇలియానాదే ఫస్ట్ ప్లేస్. అలాంటి ఈ గోవా బ్యూటీ బాలీవుడ్‌కు వెళ్లి.. ఇక్కడ ఆఫర్లకు దూరమైంది. అనుకున్నంత రేంజ్లో బాలీవుడ్లో సక్సెస్ అవలేకపోయింది. అయితే సినిమాల కంటే.. ప్రేమ విషయంలోనే ఇలియానా గురించి ఎక్కువగా చర్చించుకునేలా చేసింది.
గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్‌తో ప్రేమలో పడింది ఇలియానా. అతనితో చాలా కాలం పాటు చెట్టపట్టాలేసుకొని తిరిగింది. కానీ చివరికి ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి ఒంటిరిగానే ఉన్న ఇల్లీ బేబి.. ఆ మధ్య ప్రెగ్నేన్సి అంటూ షాక్ ఇచ్చింది. భర్త పేరు చెప్పకుండానే బాబుకి జన్మనిచ్చింది. ఫైనల్‌గా చాలా సస్పెన్స్ తర్వాత భర్తను పరిచయం చేసింది. ఫారినర్ మైఖేల్ డోలాన్ తన బిడ్డకు తండ్రి అని చెప్పింది. ప్రస్తుతం అమెరికాలో సంసార జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఇలియానా.. తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో సరిగ్గా ఏడాది కింద తీసుకున్న ఫోటో ఒకటి షేర్ చేసింది. తాను నాలుగు నెలల ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి ఫొటో ఇది.. అంటూ ఇలియానా ఈ బికినీ సెల్ఫీని షేర్ చేసింది. ఓ చేత్తో తన బేబీ బంప్‌ను చూపిస్తూ ఈ సెల్ఫీ దిగింది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.