యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ దేవర. ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత దేవరను చాలా జాగ్రత్తగా ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. అయితే.. దేవరలో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది.
Devara: నిన్న మొన్నటి వరకు దేవర ఒక్కడా? ఇద్దరా? అనే డౌట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఏకంగా ముగ్గురు అనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికైతే.. దేవర సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్‌లో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. దీంతో ఎన్టీఆర్ డబుల్ డోస్ ఇవ్వడం పక్కా అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం దేవర ఒక్కడు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు అనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఎలాంటి లీకులు బయటికి రాలేదు గానీ.. కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్‌తోనే కథను రెడీ చేసినట్టుగా లేటెస్ట్ న్యూస్ చెబుతోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేసిన సినిమా ‘జై లవకుశ’ మాత్రమే. ఇందులో జై, లవ, కుశ పాత్రల్లో కనిపించాడు టైగర్. ముఖ్యంగా జై పాత్రలో నెగెటివ్ టచ్ ఇచ్చి నట విశ్వరూపం చూపించాడు ఎన్టీఆర్.
ఇక ఇప్పుడు దేవరలో కూడా తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టుగా సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇంతకుమించిన ఐ ఫీస్ట్ మరోటి ఉండదనే చెప్పాలి. అయితే.. ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాలంటే కొరటాల చెప్పేవరకు వెయిట్ చేయాల్సిందే. లేదంటే.. సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 10 వరకు ఓపిక పట్టాల్సిందే. ఏదేమైనా.. దేవర మాత్రం ఊహించిన దానికంటే హై డోస్ ఇచ్చేలానే ఉంది.