»Former Indian Test Cricketer And Captain Dattaji Gaikwad Passed Away
Dattaji Gaikwad: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత
మాజీ భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు దత్తాజీ గైక్వాడ్ ఆనారోగ్యంతో మరణించారు. భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా పేరుపొందిన ఈయన మంగళవారం ఉదయం కన్నుమూశారు.
former Indian Test cricketer and captain, Dattaji Gaikwad, passed away
Dattaji Gaikwad: భారత మాజీ క్రికెటర్ దత్తాజీ గైక్వాడ్ ఆనారోగ్యంతో మరణించారు. భారత మాజీ టెస్ట్ క్రికెటర్, కెప్టెన్ దత్తాజీ గైక్వాడ్(95) ఫిబ్రవరి 13, మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇండియాలో జీవించి ఉన్న భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా ఆయన పేరుపొందారు. దత్తాజీరావు కృష్ణారావు గైక్వాడ్ 27 అక్టోబర్ 1928 లో జన్మించారు. ఆయన్ను అందరూ దత్తా గైక్వాడ్ అని పిలుస్తారు. 11 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాడు. 1952, 1959లో ఇంగ్లాండ్, 1952-53లో వెస్టిండీస్‌లో పర్యటించాడు. 1959 పర్యటనలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.