»Rohit Sharma Sets New Records For Most Odi Sixes In A Calendar Year
Rohit Sharma: సెమీస్‌లో సిక్సుల మోత.. రికార్డ్స్ క్రియేట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రెండు రికార్డులు సృష్టించాడు. వరల్డ్ కప్, ఒక ఏడాది వన్డే ఇంటర్నేషనల్‌లో అత్యధిక సిక్సులు కొట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు.
Rohit Sharma Breaks Another Record At World Cup Final Match
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వరల్డ్ కప్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టేడియంలో సిక్సుల మోత మోగింది. ఓ బౌలర్ అయినా సరే ఉతికి ఆరేశాడు. దీంతో మరో రెండు రికార్డులు సృష్టించాడు.
వాంఖడేలో రోహిత్ (Rohit Sharma) వరసగా సిక్సులు కొట్టాడు. దీంతో ఓ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్‌గా రికార్డ్ సృష్టించాడు. 2023 ఏడాది 60 సిక్సులు బాది టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆ తర్వాత స్థానంలో డివిలియర్స్ ఉన్నాడు. 2015లో అతను 58 సిక్సులు కొట్టాడు. వరల్డ్ కప్‌లో కూడా అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్‌గా రోహిత్ నిలిచాడు. 24 సిక్సులు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. అంతకుముందు ఇయాన్ మోర్గాన్ 22 సిక్సులతో టాప్ ప్లేస్‌లో ఉండేవాడు. ధాటిగా ఆడిన రోహిత్ శర్మ 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. రోహిత్ క్రీజులో ఉన్నంత సేపు బాల్ బౌండరీ లైన్ దాటుతూనే ఉంది. బౌండరీల వర్షం, సిక్సుల మోత మోగింది.