Abdul Razzaq: వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ ఘోరంగా ఫెయిల్ అయ్యింది. లీగ్ దశ నుంచే ఇంటి ముఖం పట్టింది. దీంతో మీడియా సమావేశంలో అబ్దుల్ రజాక్ (Abdul Razzaq) నోరు జారారు. టీమ్ మేనెజ్ మెంట్, జట్టుపై విమర్శలు చేశారు. ఆ క్రమంలో ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకుంటే మంచి, పవిత్రమైన పిల్లలు పుడతారని అనుకుంటే ఎలా..? అది ఎప్పటికీ జరగదని కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్ క్రికెటర్లు కూడా రజాక్ (Abdul Razzaq) కామెంట్లను తప్పు పట్టారు.
పాకిస్థాన్ మాజీ పేషర్ షోయబ్ అక్తర్, ఇతరులు రజాక్ కామెంట్లు సరికాదని స్పందించారు. ఒకరి మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని సూచించారు. ఇంటా, బయట విమర్శలు రావడంతో.. రజాక్ తలొగ్గారు. నెటిజన్లు అయితే ఏకీపారేశారు. రజాక్ లక్ష్యంగా విమర్శలు చేశారు. దీంతో నటి ఐశ్వర్యరాయ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. సంబంధం లేకున్నా ఐశ్వర్య పేరు ప్రస్తావించానని.. ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఒకరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని.. అనుకోకుండా అలా జరిగిందని చెప్పారు.