»Do You Know The Reason For The Notices To Namithas Husband
Virendra Chaudhary : సినీ నటి నమిత భర్తకి నోటీసులు ఎందుకో తెలుసా?
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ ఛైర్మన్ పదవికి సంబంధించి జరిగిన మోసం కేసులో సినీనటి నమిత(Namitha) భర్త చౌదరి సహా ఇద్దరు విచారణకు హాజరు కావాల్సిందిగా సేలం సెంట్రల్ క్రైం బ్రాంచి సమన్లు పంపింది.
సినీ నటి నమిత (Namitha) భర్త వీరేంద్ర చౌదరి ఇబ్బందుల్లో చిక్కున్నారు.పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ అధ్యక్షుడి పదవి ఇప్పిస్తామంటూ సేలం నగరానికి చెందిన ముత్తురామన్ జిల్లాలోని అమ్మాపాళయం జాకిర్ ప్రాంతానికి చెందిన గోపాల్‌స్వామి (Gopalswami) వద్ద రూ.50 లక్షల నగదు తీసుకుని మోసం చేశాడు. ఆ పదవికి నమిత భర్త చౌదరి ఇటీవల నియామకమయ్యారు. తాను మోసపోయినట్లు గోపాల్‌స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులో ఈ నోటీసులు (Notices) జారీ అయ్యాయి. విచారణకు హాజరుకావాల్సిందిగా వీరేంద్ర చౌదరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులకు కూడా సేలం సెంట్రల్ క్రైమ్ బ్రాంచి సమన్లు పంపించిందని సమాచారం.ఈ కేసులో ముత్తురామన్‌తోపాటు కౌల్సిల్ తమిళనాడు డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ దుశ్యంత్ యాదవ్‌ను అక్టోబర్ 31న అరెస్ట్ చేశారు.