»Bournvita These Should Be Removed From The Health Drinks Category
Bournvita: దీనిని హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలి
బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ ట్యాగ్ కోల్పోయింది. దీన్ని హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఇతర పానీయాల విషయంలో కూడా ఇదే చర్య తీసుకోవాలని ఈ-కామర్స్‌ని ఆదేశించింది.
Bournvita: బోర్న్‌విటా హెల్త్ డ్రింక్ ట్యాగ్ కోల్పోయింది. దీన్ని హెల్త్ డ్రింక్ కేటగిరి నుంచి తీసేయాలని కేంద్రం అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంలకు ఆదేశాలు జారీచేసింది. అలాగే ఇతర పానీయాల విషయంలో కూడా ఇదే చర్య తీసుకోవాలని ఈ-కామర్స్‌ని ఆదేశించింది. ఫుడ్ సేఫ్ట్రీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006 లేదా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సమర్పించిన నిబంధనల ప్రకారం హెల్త్ డ్రింక్ అనే పదాన్ని నిర్వచించలేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిమితుల కంటే ఎక్కువగా బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని ఎన్సిపిసిఆర్ చేసిన దర్యాప్తును మంత్రిత్వశాఖ ఈ రోజు జారీ చేసింది.
గతేడాది ఇన్ఫ్లూయెన్సర్ రేవంత్ హిమత్సింకా బోర్న్‌విటా గురించి ఓ వీడియో చేశాడు. బోర్న్‌విటా తప్పుదోవ పట్టిస్తోందని, అనుమతించిన దాని కంటే ఇందులో చక్కెర శాతం అధికంగా ఉందని ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కూడా అయ్యింది. దీంతో ఆ ఇన్‌ఫ్లూయెన్సర్‌కి బోర్న్‌విటా నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో అతని వీడియోను తొలగించారు. అయితే నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నివేదికను హైలెట్ చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ప్యాకేజింగ్, లేబుల్స్ని ఉపసంహరించుకోవాలని బోర్న్‌విటాను కోరింది. ఈక్రమంలో తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. డెయిరీ సంబంధిత, మాల్ట్ ఆధారిత డ్రింక్‌లను హెల్త్ డ్రింక్‌లుగా లేబుల్ చేయవద్దంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేశాయి.