»The Popular Brand Horlicks Lost The Title Of Health Drink What Is The Reason
Horlicks: హార్లిక్స్ కూడా హెల్తీ డ్రింక్ కాదా..?
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆరోగ్య పానీయాలలో హార్లిక్స్ ఒకటి. ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. అయితే ఈసారి హార్లిక్స్ హెల్త్ డ్రింక్స్ నుంచి తొలగించింది.
Horlicks: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆరోగ్య పానీయాలలో హార్లిక్స్ ఒకటి. ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. అయితే ఈసారి హార్లిక్స్ నిర్వచనం మారనుంది. బోర్న్ విటాని రీసెంట్ గా హెల్దీ డ్రింక్ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సంఘటనతో హార్లిక్స్ కూడా తన లేబుల్‌ని మార్చుకుంది. ప్రముఖ పానీయమైన హార్లిక్స్ ఈసారి తనను తాను మార్చుకుంది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ హార్లిక్స్‌ను ‘హెల్త్ డ్రింక్’ కేటగిరీ నుండి తొలగించింది. కంపెనీ ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరీ మార్చింది. హార్లిక్స్‌ను ఇప్పుడు ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ అంటారని ప్రకటించింది.
ఈ పానీయం బాటిల్ లేదా పెట్టెపై ‘హెల్త్ డ్రింక్’ అని రాసి ఉండదు. ఇటీవల వాణిజ్యం , పరిశ్రమల మంత్రిత్వ శాఖ ‘హెల్త్ డ్రింక్’ పేరుతో భారతదేశంలో విక్రయించే అన్ని పానీయాలు లేదా పౌడర్లను జాబితా చేయాలని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది. బోర్నెవిటాను కూడా ‘హెల్త్ డ్రింక్స్’ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఆ తర్వాత హిందుస్థాన్ యూనిలీవర్ తన ఉత్పత్తులను మార్చుకుంది. ఇక తనకు తాను లేబులింగ్ మార్చుకోవడంతో.. హార్లిక్స్ ని తాగాలంటే చాలా మంది భయపడుతున్నట్లు తెలుస్తోంది.