ప్రజెంట్ ముంబైలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అక్కడ హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత దేవర షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. కానీ ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం దేవర కష్టమే అంటున్నారు.
Devara: యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారుతూ.. దేవర సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా రిలీజ్కుమరో ఆరునెలల సమయం ఉంది. అక్టోబర్ 10న దేవర పార్ట్ 1 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ షెడ్యూల్ అయిపోగానే.. మే ఫస్ట్ వీక్ నుంచి దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోను జూన్, జూలై వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు కొరటాల.
ఇదిలా ఉంటే.. మే 20న ఎన్టీఆర్ బర్డ్ డేకి దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టుగా.. గతకొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది. దీంతో.. డీజే మోతకు రెడీ అవుతున్నారు టైగర్ ఫ్యాన్స్. అయితే.. సినిమా రిలీజ్‌కు చాలా సమయం ఉంది కదా? అందుకే, ఇప్పుడే ఫస్ట్ సింగిల్ రావడం కష్టం అనేది లేటెస్ట్ అప్డేట్. ప్రస్తుతానికి కొరటాల ఫోకస్ మొత్తం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పైనే ఉందట. అనిరుధ్ కూడా అనుకున్నంత స్పీడ్‌లో లేడట. స్లోగా దేవర ట్యూన్స్ రెడీ చేస్తున్నట్టుగా సమాచారం.
షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్‌కు ముందు జులైలో దేవర ఫస్ట్ సింగిల్ విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. అయితే.. ఎన్టీఆర్ బర్త్ డేకి దేవర అప్డేట్ ఉండదా? అంటే, ఉంటుందనే చెప్పాలి. ఫస్ట్ సింగిల్ రిలీజ్ లేకపోయినా.. టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. లేదంటే.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసినా చేయొచ్చని అంటున్నారు. అయితే.. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. మే 20 వరకు వెయిట్ చేయాల్సిందే.