Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టీ20 కెరియర్.. గోల్డెన్ మెమరీస్
రోహిత్ శర్మ టీ 20 ఆటకు గుడ్ బై చెప్పాడు. సుదీర్ఘ కాలం పాటు పొట్టి క్రికెట్ ఆటను ఆస్వాదించిన రోహిత్ శర్మ ... వరల్డ్ కప్ విజయం తర్వాత తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.
Rohit Sharma: రోహిత్ శర్మ టీ 20 ఆటకు గుడ్ బై చెప్పాడు. సుదీర్ఘ కాలం పాటు పొట్టి క్రికెట్ ఆటను ఆస్వాదించిన రోహిత్ శర్మ … వరల్డ్ కప్ విజయం తర్వాత తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. మొత్తంగా తన కెరీర్లో 159 మ్యాచ్‌లు ఆడాడు. 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలున్నాయి. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్నాడు రోహిత్. బౌలింగ్ కూడా చేసిన రోహిత్ ఒక వికెట్ కూడా పడగొట్టాడు. గత తొమ్మిది టీ-20 వరల్డ్ కప్ టోర్నీలలోనూ భారత్ తరపున ఆడిన ఏకైక ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ ..చరిత్ర సృష్టించాడు.
37 సంవత్సరాల రోహిత్ 18 సంవత్సరాల తన టీ-20 ప్రస్థానంలో 159 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి 5 శతకాలు చేయడంతో పాటు 32 అర్థశతకాలు సాధించాడు. రోహిత్ శర్మ తన మొట్టమొదటి T 20 సెంచరీ 2015లో సాధించాడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 106 పరుగులు చేశాడు. 2017లో శ్రీలంక జట్టుపై సెంచరీ చేయడం ద్వారా తన రెండో టీ 20 పూర్తి చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 118 పరుగులు చేశాడు. 2018లో ఆడిన టీ 20 మ్యాచుల్లో రోహిత్ శర్మ రెండు సెంచరీలు చేశాడు. జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో రోహిత్ సరిగ్గా 100 పరుగులు చేశాడు. అదే ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 111 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 2024 జనవరి నెలలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ చెలరేగి ఆడాడు. 121 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
తొలిసారిగా 2007లో నిర్వహించిన టీ-20 ప్రపంచకప్ టోర్నీలో …. ధోనీ నాయకత్వంలోని టీమిండియా తొలిప్రయత్నంలోనే వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. జోహెన్స్ బర్గ్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన టైటిల్ పోరులో భారత్ విజేతగా నిలవడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర వహించాడు. తిరిగి 17 సంవత్సరాల తరువాత..భారత సారధిగా రోహిత్ తనజట్టును మరోసారి టీ-20 చాంపియన్‌గా నిలుపగలిగాడు. కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు గొప్ప కానుకను అందించాడు. ఓ ఘన విజయం తర్వాత తన కెరీర్‌కు ముగింపు పలికాడు.