టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సూపర్ 8 కి చేరుకుంది. అలాగే మొత్తం జట్లు కూడా ఫైనల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు బీచ్ వాలీబాల్ ఆడుతూ తమ ఫిట్ నెస్‌ను కాపాడుకుంటున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఎప్పటిలాగే ఉత్సహాంగా ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Virat Kohli playing volleyball on the beach with his shirts off.
Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సూపర్ 8 కి చేరుకుంది. అలాగే మొత్తం జట్లు కూడా ఫైనల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు బీచ్ వాలీబాల్ ఆడుతూ తమ ఫిట్ నెస్‌ను కాపాడుకుంటున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఎప్పటిలాగే ఉత్సహాంగా ఆడుతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఇండియన్ ప్లేయర్స్ అందరూ దక్షిణ అమెరికాలో ఉన్నారు. ఇక లీగ్ దశ మ్యాచుల అయిపోయి. ఇప్పుడు సూపర్ 8లో ఉన్న జట్ల విషయంలో క్లారిటీ వచ్చేసింది. రెండు గ్రూపులుగా ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జూన్ 19 నుంచి 25వ తేదీ వరకు ఈ సూపర్-8 మ్యాచులు జరగుతాయి. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అందులో భాగంగా జూన్ 20న బార్బడోస్‌లో ఆఫ్గనిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
ఈ నేపథ్యంలో భారత ప్లేయర్లు సరదాగా వాలీబాల్ ఆడుతున్నారు. ఇది కూడా తమ ఫిట్ నెస్‌కు ఉపయోగపడుతుంది. ఈ బీచ్ వాలీబాల్ ఆడుతున్న వీడియోను బీబీసీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. విరాట్ కోహ్లీ, హర్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, శివం దూబే, యజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్ అందరూ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.