»Former Cm Yeddyurappa Appeared Before The Cid In The Case Of Sexual Harassment Of A Girl
Yeddyurappa: బాలికపై లైంగిక వేధింపుల కేసులో సీఐడీ ముందు హాజరైన మాజీ సీఎం యడుయూరప్ప
మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడుయూరప్పను నేడు సీఐడీ విచారించనుంది. ఆయనపై ఈ కేసులో పోక్సె కేసు కూడా నమోదు అయింది.
Former CM Yeddyurappa appeared before the CID in the case of sexual harassment of a girl
Yeddyurappa: కర్ణాటక మాజీ సీఎం యాడుయూరప్ప ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధింపు కేసు ఎంత సంచలనం అయిందో అందరికీ తెలుసు. ఈ కేసులో ఆయనపై పోక్స్ కేసు నమోదు అయింది. ఈ కేసులో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం యడుయూరప్ప ఈ రోజు సీఐడీ ముందు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఆయన్ను విచారించనున్నారు. సోమవారం ఉదయం నుంచి బెంగళూరులోని సీఐడీ కార్యలయంలో విచారణ జరుగుతుంది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేస్తారు. కానీ ఈయన విషయంలో కోర్టు వెసులబాటు కల్పించింది.
పోక్సో కేసులో యడుయూరప్పను అరెస్టు చేయొద్దని కర్ణాటక కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే కేసు విచారణ పేరిట ముందుస్తు అరెస్టు చేయొద్దని, అదేవిధంగా విచారణకు ఎట్టిపరిస్థితిలో హాజరు కావాలని యడుయూరప్పకు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిలో భాగంగా ఈరోజు సీఐడీ ముందు హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఓ 17 ఏళ్ల బాలికను లైంగికంగా వేదించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ కేసులో మోసం పోయినట్లు తల్లి, కూతుర్లు ఇద్దరు న్యాయం కోసం ఆయన్ను కలిస్తే తన కూతుర్ని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు అయింది. కేసు నమోదు చేసిన బాధితురాలి తల్లి ఇటీవల ఉపిరితిత్తుల క్యాన్సర్తో మరణించింది. తాను చనిపోయే ముందు మరణవాగ్మూలం ఇచ్చింది. ఈ కేసులో తాను నిర్దోశిని అని, న్యాయపోరాటం చేస్తా అని యడుయూరప్ప అంటున్నారు.