»Calling Stranger Darling Constitutes Sexual Harassment Calcutta High Court
High Court: డార్లింగ్ అని పిలిస్తే అది లైంగిక వేధింపే
డార్లింగ్ అని పిలవడం అసభ్యత కిందికి వస్తుందన్న హైకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ మాటను లైగింక వేధించినట్లే అని సెక్షన్ 354ఏ, 509 కింద విచారించవచ్చునని వెల్లడించింది.
Calling stranger 'darling' constitutes sexual harassment: Calcutta High Court
High Court: సాధారణంగా డార్లింగ్ అని పిలవడం కొందరికి అలవాటు. మనకు ఇష్టమైన వాల్లను ఆత్మీయతతో డార్లింగ్ అని పిలవడం తప్పేమీ ఉండదని ఇన్నాళ్లు భావించాము కానీ, అలా పిలిస్తే దాన్ని లైంగిక వేధింపుగా పరిగణించి కేసు నమోదు చేయొచ్చు అని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే మహిళలకు ఇష్టం లేకుండా డార్లింగ్ అని పిలవడం కలకత్తా హైకోర్టు తప్పు పట్టింది. కోల్ కతాలో దుర్గాపూజ సందర్భంగా మహిళా పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి మహిళా కానిస్టేబుల్ను డార్లింగ్ అని పిలిచాడు. ఇద్దిరి మధ్య గొడవ జరిగింది. దాంతో పోలీసు సదరు వ్యక్తిపై మాయాబందర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
ఈ కేసు విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు ఏ మాత్రం పరిచయం లేకుండానే ఓ మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందికి వస్తుందని తీర్పు ఇచ్చింది. అలా పిలిచిన వారిని ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింది విచారించవచ్చునని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అనే పిలవడం అసభ్యత కిందికి వస్తుందని కలకత్తా హైకోర్టు ధర్మాసనం వివరించింది.