»Mark Zuckerberg Shocked To Know The Price Of Anant Ambanis Watch
Mark Zuckerberg: అనంత్ అంబానీ వాచ్ ధర తెలిసి షాక్ అయిన మార్క్ జూకర్ బర్గ్
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు అంబరాన్ని అంటాయి. గుజరాత్‌లోని జామ్ నగర్ మొత్తం ప్రముఖులతో నిండిపోయింది. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. అతను పెట్టుకున్న వాచ్ ధర తెలిసి మార్క్ జూకర్ బర్గ్ సైతం నివ్వెరపోయాడు.
Mark Zuckerberg shocked to know the price of Anant Ambani's watch
Mark Zuckerberg: భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani) వివాహ వేడుకలు అంబరాన్ని అంటాయి. ప్రీవెడ్డింగ్ వేడుకల్లో భాగంగా అనంత్ అంబానీ, తనకు కాబోయే భార్య రాధిక మర్చెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రపంచ నలుమూల నుంచి వచ్చి అతిథులను అలరించడానికి సంగీత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పాప్ సింగర్ రిహన్నతో ఓ షో చేపించారు. దానికి ఆమే రూ. 9 కోట్ల వరకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ మొత్తం చాలా హడావిడిగా ఉంది. ఈ వేడుకల్లో అడుగడుగునా అంబానీల వైభవం కనిపస్తోంది. సోషల్ మీడియా మొత్తం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఈ వేడుకలకు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ తన సతీమణి ప్రిసిల్లా చాన్‌తో పాటు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. జుకర్ బర్గ్(Mark Juker Burg) ఫ్యామిలీతో అనంత్ అంబానీ మాట్లాడుతున్న ఓ వీడియో వైరల్ అవుతుంది. అంబానీ మర్యాదల గురించి వారిని అడుగుతున్నాడు అనంత్, అదే సమయంలో ఇక్కడి ప్రదేశాలు ఏమన్నా చూడాలనుకుంటే ఏర్పాట్లు చేస్తా అని వారితో చెబుతున్నాడు. అదే సమయంలో మార్క్ జుకర్ బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ అనంత్ చేతికి ఉన్న ఖరీదైన డిజైనర్ గడియారాన్ని ఆసక్తిగా పరిశీలించడం జరిగింది. ఆ వాచ్ ఆడెమర్స్ ప్యూగట్ రాయల్ ఓక్ ఓపెన్ వర్క్ డ్ స్కెలెటన్ అని అనంత్ వివరించారు. ఆ వాచ్ ఖరీదు రూ.14 కోట్లు అని చెప్పడంతో జుకర్ బర్గ్‌తో సహా అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ ప్రస్తుతం అవుతోంది.
Mark Zuckerberg & his wife Priscilla was surprised to see Anant Ambani's watch. Anant was seen carrying beautiful audemars piguet royal oak open worked skeleton worth INR 14 crore. 🤑#AnantRadhikaWedding | #AnantAmbanipic.twitter.com/DEql5XFWUA