Varalakshmi Sarath Kumar engagement.. Who is the groom?
Varalakshmi Sarath Kumar: డైనమిక్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ పరిశ్రమ నుంచి వచ్చినా తెలుగులో మంచి ఆధారణ పొందిన నటీ. లేడీ విలన్ పాత్రలు, రెబల్ పాత్రల్లో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్. సీనియర్హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా పరిశ్రమలో అడుగు పెట్టి తనదైన పాత్రలతో స్టార్ నటీగా కొనసాగుతుంది. ఈ నటీ ఏ హడావిడీ లేకుండా నిశ్చితార్థం చేసేసుకుంది. విషయం తెలిసిన నెటిజనులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తన ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 38 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో ఒకరిద్దరి హీరోలతో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. ఇక విశాల్‌తో డేటింగ్ చేస్తోందని, త్వరలో పెళ్లనే టాక్ కూడా వినిపించింది. ఎట్టకేలకు ఎవరికీ చెప్పకుండా ఎంగేజ్ మెంట్ చేసుకుంది.
ఇంతకీ వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar) మనుసుదోచుకున్న వ్యక్తి ఎవరు అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అయితే తన పేరు నికోలాయ్ సచ్ దేవ్(Nikolai Such Dev). ముంబయికి చెందిన వ్యాపారవేత్త. వీరిద్దరి పరిచయం ఇప్పటిది కాదు. దాదాపు 14 ఏళ్లుగా స్నేహితులుగా ఉంటున్నారు. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చాయి. వీరి స్నేహం ప్రేమగా మారింది. నికోలాయ్ సచ్ దేవ్ వ్యాపారవేత్తగానే కాకుండా, కళలను ప్రోత్సహించే వ్యక్తి. ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటు చేయడం, పెయింటింగులను ఆన్ లైన్ లో విక్రయించడం కూడా చేస్తుంటాడు. ఈ మేరకు వీరి ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ ముంబయిలో జరిగింది. ప్రస్తుతం వీరి ఫోటోలు ఇంటర్నెట్తో తెగ వైరల్ అవుతున్నాయి.