»Varalaxmi Big Shock For Varalaxmi Is The Arrest Wrong
Varalaxmi: వరలక్ష్మీకి బిగ్ షాక్? అరెస్ట్ తప్పదా?
టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకే వరలక్ష్మీకి డ్రగ్స్ కేసులో నోటీసులు రావడం హాట్ టాపిక్‌గా మారింది. మరి వరలక్ష్మీ అరెస్ట్ తప్పదా?
Varalaxmi: శరత్ కుమార్ కూతురిగా సినీ ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ.. నటిగా తనకంటూ ప్రత్యేకగా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గానే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ.. తాజాగా డ్రగ్స్ కేసు విషయంలో కేంద్ర దర్యప్తు సంస్థ ఎన్ఐఏ నుంచి నోటీసులు రావడం హాట్ టాపిక్‌గా మారింది. డ్రగ్స్ కేసుతో సంబంధమున్న వరలక్ష్మీ మాజీ పర్సనల్ అసిస్టెంట్‌ని ప్రశ్నించేందుకు కొచ్చిలోని కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. ఆదిలింగం అనే వ్యక్తి వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గర కొన్నాళ్లు పనిచేశాడు. డ్రగ్స్, ఆయుధాల సరఫరాలో అంతర్జాతీయ స్మగ్లర్లతో అతనికి సంబంధాలున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
దాంతో ఆ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇబ్బందులు ఏదురుకోక తప్పడంలేదు. ఆదిలింగం నుంచి 300 కేజీల హెరాయిన్, ఏకే 47 రైఫిల్, 9 ఎంఎం తుపాకులు, 2,100 కోట్ల విలువైన మందు గుండు సామగ్రిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చే డబ్బును ఆదిలింగం సినీ పరిశ్రమలో పెట్టుబడిగా పెడుతున్నారని గుర్తించారు. అందుకే ఆదిలింగం గతంలో పీఏగా పనిచేసిన నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ను కూడా విచారించాలని ఎన్ఐఏ నిర్ణయించింది.
ఈ విచారణకు వరలక్ష్మి శరత్‌కుమార్‌కు సమన్లు అందాయని, ఎన్ఐఏ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని ఆమె కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వరలక్ష్మీ తండ్రి శరత్‌కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే.. రీసెంట్‌గానే వరలక్ష్మీకి ఎంగేజ్మెంట్ జరగగా.. ఇలా నోటీసులు అందడం హాట్ టాపిక్‌గా మారింది.