నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్ఫెండ్ నికోలై సచ్దేవ్ను వివాహం చేసుకుంది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో థాయ్‌లాండ్‌లో వాళ్ల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు.
Nikolai Sachdev: I am not Varalakshmi's first love
Nikolai Sachdev: నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్ఫెండ్ నికోలై సచ్దేవ్ను వివాహం చేసుకుంది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో థాయ్‌లాండ్‌లో వాళ్ల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట తొలిసారి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నికోలై సచ్దేవ్ వరలక్ష్మిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. పెళ్లి తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ తన పేరును మార్చుకోదని స్పష్టం చేశారు. తాను, తన కుమార్తె వరలక్ష్మి పేరు పెట్టుకోనున్నట్లు తెలిపారు. అయితే వరలక్ష్మి ఫస్ట్ లవ్ మాత్ర్రం తను కాదని తెలిపారు. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ వరలక్ష్మి ఫస్ట్‌లవ్ తాను కాదని నికోలై తెలిపారు.
ఆమెకు ఫస్ట్ లవ్ సినిమాలే. ఆ తర్వాతే నేను. అందుకే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తుందని తెలిపారు. ఇకపై తన పేరు నికోలై వరలక్ష్మి శరత్‌కుమార్ సచ్‌దేవ్‌గా మార్చుకుంటున్నానని తెలిపారు. వరలక్ష్మి శరత్ కుమార్, నికోలై సచ్దేవ్ ఈ ఏడాది మార్చిలో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ నెల మొదటివారంలో చెన్నైలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ తర్వాత ఈ జంట థాయ్‌లాండ్ వెళ్లారు. అక్కడ కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.