Huge tremors in Singapore Airlines flight.. One person died
Singapore Airlines: గాల్లో ఎగురుతున్న విమానంలో ఒక్కసారిగా భారీ కుదుపులు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ (Singapore Airlines)కు చెందిన SQ321 విమానం భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో మే 20న బ్రిటన్ రాజధాని లండన్ నుంచి సింగపూర్‌కు విమానం బయల్దేరింది. దారి మధ్యలో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫ్లైట్‌ను థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు.
ఈ ప్రమాదంలో ఇకరు మృతి చెందారని సంస్థ తెలిపింది. అలాగే మరో 30 మందికి గాయాలైనట్లు ఓ ప్రకటనలో తెలిపారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను అవసరమైన వైద్య సేవాలు అందించేందుకు థాయ్‌లాండ్ అధికారురులు అన్ని విధాల ఏర్పాటు చేపట్టారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఎయిర్‌లైన్స్ నామ్స్ ప్రకారం మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి గల పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.