ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు (Bus Accident) అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం (14 died) చెందారు. ఈ దారుణ ఘటన థాయ్లాండ్ (Thailand)లో చోటుచేసుకుంది. అర్ధరాత్రి తర్వాత ఈ ఘోరం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బస్సు ఢీకొనడంతో బస్సు ముందు భాగం రెండు ముక్కలైంది. ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.
ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు 14 మంది ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ప్రమాదంలో మరో 20 మందికి తీవ్రంగా గాయాలు (20 Passengers injured) అయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. థాయ్లాండ్ లోని ప్రచౌప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఈ ప్రమాదం (Accident) జరిగిందని అధికారులు వెల్లడించారు.
అతివేగం (High Speed) వల్లే ఈ ప్రమాదం (Accident) జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. బస్సు వేగం కంట్రోల్ కాకపోవడం వల్ల ఆ బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొందని అధికారులు వివరించారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని, దర్యాప్తు చేసిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.