»Shocking 28522 Murders In The Country 78 Murders Every Day
Murder Cases: దేశంలో 28,522 హత్యలు..రోజూ 78 మర్డర్లు..!
2022వ ఏడాదిలో దేశవ్యాప్తంగా ఎన్ని హత్యా కేసులు నమోదయ్యాయనే విషయంపై నేడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారంగా దేశ వ్యాప్తంగా సగటున ప్రతి గంటకూ మూడుకు పైగా మర్డర్లు జరుగుతున్నట్లు తేలింది. ఈ హత్యల్లో 70 శాతం మంది పురుషులే చనిపోతున్నట్లుగా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.
దేశవ్యాప్తంగా గత ఏడాదిలో 28,522 హత్యాకేసులు (Murder Cases) నమోదయ్యాయని, ప్రతి రోజూ సగటున 78 మర్డర్లు జరిగినట్లుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) వెల్లడించింది. ప్రతి గంటకూ మూడుకు పైగా మర్డర్లు జరిగాయని క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (Crime Records Bureau) ప్రకటించింది. 2020లో నమోదైన హత్యా కేసుల సంఖ్య 29,193 ఉండేవని, ఆ తర్వాత 2021లో 29,271 హత్యా కేసులు నమోదైనట్లుగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూర్ అయిన ఎన్సీఆర్బీ (NCRB) నివేదిక వెల్లడించింది.
ఎన్సీఆర్బీ (NCRB) అందించిన వార్షిక నేర నివేదిక ప్రకారంగా 2022లో వివాదాల కారణంగా 9,962 హత్యలు జరిగాయి. వ్యక్తిగతంగా లేదా పగ వల్ల 3,761 హత్యా కేసులు నమోదయ్యాయి. సొంత లాభం కోసం 1,884 హత్యలు చోటుచేసుకున్నట్లు నివేదిక గణాంకాలు వెలువడ్డాయి. ఇకపోతే రాష్ట్రాల వారీగా చూస్తే హత్యా కేసుల నమోదులో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. 2022లో ఆ రాష్ట్రంలో అత్యధికంగా 3,491 మర్డర్లు జరిగాయి. బీహార్‌లో 2,930 కేసులు, మధ్యప్రదేశ్‌లో 1,978 కేసులు, రాజస్థాన్ 1,834 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే భారీగా 43.92 శాతం హత్యా కేసులు రికార్డ్ అయినట్లు క్రైమ్ బ్యూరో నివేదిక తెలిపింది.
ఇకపోతే దేశంలోనే తక్కువగా హత్యా కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఆ రాష్ట్రంలో 9 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 509 కేసులు నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతం అయిన లక్షద్వీప్‌లో ఎలాంటి మర్డర్ కేసు నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా హత్యా కేసుల్లో చనిపోయిన వారిలో 70 శాతం మంది పురుషులు ఉన్నారు. మహిళలు 8,125 మంది ఉండగా, థర్డ్ జెండర్ 9 మంది ఉన్నట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (Crime Records Bureau) వెల్లడించింది.