Hyderabad: హైదరాబాద్‌లో దారుణం..యువతిపై సామూహిక అత్యాచారం!
తార్నాకలో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ (Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తార్నాక (Tarnaka)లో బస్సు కోసం వేచి ఉన్న యువతిపై సామూహిక అత్యాచారం ఘటన వెలుగుచూసింది. బస్సు కోసం ఎదురుచూస్తున్న యువతిని ఓ వ్యక్తి గమ్యస్థానంలో దింపుతానని చెప్పి తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ నగర్‌కు చెందిన బర్నే వాసు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
ఈనెల 7వ తేది అర్థరాత్రి తన పనిని ముగించుకుని బర్నే ఏసు ప్రశాంత్ నగర్ లోని తన నివాసానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో తార్నాక బస్టాప్ వద్ద ఓ యువతి బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఆ యువతిని చూసిన ఏసు బైక్ ఆపి ఆమెతో మాటలు కలిపాడు. ఆమెను లాలా పేటలో దింపుతానని చెప్పి తన బైక్ ఎక్కించుకున్నాడు. ఆమెను మాటల్లో పెట్టి ప్రశాంత్ నగర్ లోని రైల్వే క్వార్టర్స్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
ఆ తర్వాత తన నలుగురు స్నేహితులను అక్కడికి పిలిపించుకున్నాడు. అందరూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని తార్నాకలో వదిలి వెళ్లిపోయారు. ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రస్తుతం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును విచారిస్తున్న పోలీసులు నిందితులకు కఠిన శిక్షపడుతుందని చెబుతున్నారు.