Star daughter who rejected Naga Chaitanya? Is it because of Samantha?
Naga Chaitanya: ‘ఏ మాయ చేశావే’ సినిమా సమయంలో ప్రేమలో పడి.. కొన్నాళ్లు చట్టాపట్టాలేసుకొని తిరిగిన నాగ చైతన్య, సమంత.. పెద్దలను ఒప్పించి గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే ఇద్దరు విడిపోతున్నట్టుగా ప్రకటించి షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. మళ్లీ ఈ ఇద్దరు కలిసి సందర్భాలు లేవు. అయితే.. చైతన్యతో విడిపోయిన తర్వాత మయోసైటిస్ బారిన పడింది సమంత. అప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేజ్ చేస్తునే ఉంది. దీంతో సామ్ పై జనాల్లో సానుభూతి ఉంది. ఆమెకు అభిమానులు అండగా నిలబడ్డారు. కానీ ఈ మధ్య సామ్ చేస్తున్న అతి చూసి ఆమెను నమ్మడం కాస్త కష్టంగా మారింది. కానీ సామ్‌కు ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్లంత సామ్ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నారు. ఈ కారణంగానే నాగ చైతన్యను చాలా మంది రిజెక్ట్ చేసినట్టుగా టాక్ ఉంది.
చదవండి:Pawan Kalyan: ఉస్తాద్ ఒక్కడే కాదు.. OG కూడా వచ్చేస్తున్నాడు?
శరత్ కుమార్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ హీరోయిన్గా రాణించడానికి ట్రై చేసింది. కానీ ఆ తర్వాత యూ టర్న్ తీసుకొని క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొడుతోంది. క్రాక్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్‌కు గతంలో నాగ చైతన్య సరసన నటించే ఛాన్స్ వచ్చిందట. కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నాగచైతన్యతో నటించని చెప్పేసిందట. ఎందుకంటే.. సమంత, వరలక్షి మధ్య మంచి స్నేహం ఉంది. ఈ కారణంగానే అతనితో నటించనని చెప్పిందట. అయితే.. సమంతతో కలిసి యశోద సినిమాలో కలిసి నటించింది వరలక్ష్మీ. ఏదేమైనా.. సామ్ పై ప్రేమతో చైతన్యను రిజెక్ట్ చేసిందనేది హాట్ టాపిక్‌గా మారింది.
చదవండి:Kanguva: ‘కంగువ’ టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

