»Rupert Murdoch 93 Years Old Billionaire Ready For Fifth Marriage
Rupert Murdoch: 92 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లికి సిద్ధమైన బిలియనీర్
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాతో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాదిలో వివాహం చేసుకోనున్నారు.
Rupert Murdoch: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రూపర్ట్ మర్దోక్ 92 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాతో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో కాలిఫోర్నియాలోని మర్దోక్ ఎస్టేట్‌లో వీళ్ల వివాహం జరగనుంది. రూపర్ట్ ఇప్పటికి ఆరుసార్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే ఇది అతనికి ఐదో వివాహం. గతేడాది ఆన్ లెస్లీ స్మిత్‌తో ఎంగేజ్మెంట్ జరగ్గా.. నెల వ్యవధిలోనే ఆ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత కొన్ని నెలలకు తన బాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్ ఇచ్చిన పార్టీలో మర్దోక్‌కు జుకోవా పరిచయమయ్యారు. అప్పటి నుంచి డేటింగ్లో వీళ్లు త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టారని సమాచారం.
రష్యాకు చెందిన ఎలీనా జుకోవా అమెరికాకు వలస వచ్చారు. ఆమెకు ఇది రెండో వివాహం. మర్దోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్‌ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా మన్ను వివాహం చేసుకుని.. 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్‌ని పెళ్లిచేసుకుని.. 2013 వరకూ కాపురం చేశారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన.. ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు.