Meteorological Department said more sunshine in Hyderabad in the next 5 days
Meteorological: శివరాత్రి కూడా అయిపోలేదు అప్పుడే భానుడు భగ భగ మంటున్నాడు. ఇక తెలంగాణ(Telangana) రాష్టంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. తాజాగా అధికారులు కూడా ఇదే చెబుతున్నారు. వేసవి ప్రారంభం కాకముందే ఎండలు(Hot Summer) మండి పోతున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో వేడి విపరీతంగా పెరిగిందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సగం జిల్లాలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఇదే నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రత (Temperatures) 37 డిగ్రీల సెల్సియస్‌ను క్రాస్ చేసిందని తెలిపింది. ఈ రానున్న 5 రోజులల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
పగటి వేలల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగేఅవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలోని ప్రజలు ఎండవేడికి తట్లుకోలేకపోతున్నారు. దీనికి ఎల్‌నినో ప్రభావమే కారణం అని, అందుకే మార్చి మొదటి వారంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధా రణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీసే అవకాశాలున్నాయని పేర్కొంది. మార్చి-మే మధ్య కాలంలో దేశంలో అనేక చోట్ల గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని భారత వాతావరణశాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.