»Yediyurappa Sexual Harassment Of Girl Pocso Case Registered Against Cm
Yediyurappa: బాలికపై లైంగిక వేధింపులు.. సీఎంపై పోక్సో కేసు నమోదు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.
Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఓ మైనర్ బాలికపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు గత నెల బాధితురాలు, ఆమె తల్లి యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న వాల్లు పోలీసులను ఆశ్రయించగా.. అర్థరాత్రి తర్వాత పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈ ఆరోపణలపై యడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. ఆయన కార్యాలయం వీటిని ఖండించింది. ఫిర్యాదుదారు గతంలో కూడా చాలామందిపై ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపారు. ఇలా వాళ్లు ఇప్పటివరకు 53 ఫిర్యాదులు చేశారంటూ ఆ జాబితాను విడుదల చేసింది. యడియూరప్ప కర్ణాకటకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే గతేడాది నవంబరులో ఆ బాధ్యతలను హైకమాండ్ ఆయన కుమారుడు విజయేంద్రకు అప్పగించింది. ప్రస్తుతం యడియూరప్ప బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.