TG: హైదరాబాద్ KPHB పరిధిలోని సర్ధార్ పటేల్‌నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నగలు చోరీకి గురయ్యాయి. గర్భగుడి తాళాలు పగులగొట్టి విగ్రహానికి ఉన్న నగలను దుండగులు అపహరించారు. సుమారు రూ.50 లక్షల విలువైన వెండి నగలు ఎత్తికెళ్లినట్లు సమాచారం. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.