బంగారంలాగే వెండి ఆభరణాలకు కూడా హాల్మార్క్ (Hallmark) తప్పనిసరి చేసే యోచనలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వెండి ధరలు భారీగా పెరగడంతో నాణ్యత ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెండిపై హాల్మార్క్ స్వచ్ఛందం మాత్రమే కాగా, త్వరలో నిబంధనలు మారే అవకాశం ఉంది.